![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -450 లో..... ప్రేమ ఎస్.ఐ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిందని ధీరజ్ కి తెలుస్తుంది. అదే విషయం ప్రేమకి ధీరజ్ ఫోన్ చేసి చెప్తాడు. ఎగ్జామ్ ముందు రోజు చదువుకోవే అంటే విన్లేదు ఫెయిల్ అయిన లిస్ట్ లో లాస్ట్ లో ఉన్నావని ధీరజ్ అనగానే ఏంటి ఎస్.ఐ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యనా అని ప్రేమ అంటుంది. పక్కన రామరాజు వాళ్ళు విని ఎవరు ఫెయిల్ అయ్యారని అడుగుతాడు. ఎవరు లేదు మావయ్య అని ప్రేమ కవర్ చేస్తుంది. మరొకవైపు భాగ్యం వాళ్ళు ఒక మాంత్రికుని దగ్గరికి వెళ్తారు. మా అల్లుడికి వశీకరణ చెయ్యాలని భాగ్యం చెప్తుంది.
అన్ని విషయాలు చెప్పి అతని బుర్ర తింటుంది భాగ్యం. ఆ తర్వాత వల్లికి ఒక తాయత్తు ఇచ్చి ఇది మీ ఆయనకి కడితే నీ కొంగు చుట్టూ తిరుగుతాడని అతను అనగానే వల్లి సంతోషంగా ఆ తాయాత్తు తీసుకొని వెళ్తుంది. మరొకవైపు ధీరజ్ వచ్చి తనని ఎక్కడ తిడతాడోనని ప్రేమ బయట బట్టలు ఆరేసే దండం పట్టుకొని చూస్తుంది. అప్పుడే నర్మద వస్తుంది. ధీరజ్ వస్తాడని భయంగా ఉంది అక్క నేను ఫెయిల్ అయ్యానని ప్రేమ చెప్తుంది. పర్లేదులే అని నర్మద అంటుంది. అప్పుడే దండెం తెగిపోతుంది. దండెం కట్టడానికి తాడు కోసం నర్మద లోపలికి వెళ్తుంది. ప్రేమ పాత తాడుని సరి చేస్తుంది. అప్పుడే ధీరజ్ వచ్చి ప్రేమ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిందని సూసైడ్ చేసుకుంటుందని అనుకొని త్వరగా వచ్చి ప్రేమ వద్దు మరొక ఛాన్స్ ఉంటుందని అంటాడు. ప్రేమకి విషయం అర్ధం అయి నేను ఉండనురా అని యాక్టింగ్ చేస్తుంది. అప్పుడే నర్మద తాడుతో వస్తుంది. అసలు విషయం ధీరజ్ కి తెలిసి.. రాక్షసి అంటూ తనని కొట్టడానికి తన వెంట పరుగెడుతాడు.
ఆ తర్వాత సాగర్ చిరాకుగా ఇంటికి వస్తాడు. అప్పుడే నర్మద వచ్చి మాట్లాడుతుంటే సాగర్ చిరాకుపడతాడు. భోజనం చేద్దామని నర్మద అడుగగా నాకేం వద్దని సాగర్ కోప్పడతాడు. ఎవరి మీద కోపమో నాపై చూపిస్తావ్ ఏంటని నర్మద అంటుంది. తరువాయి భాగంలో శ్రీవల్లి హోటల్ లో పని చేయడం ధీరజ్ వాళ్ళు చూస్తారు. ఆ తర్వాత ఆక్సిడెంట్ చేసిన రౌడీ ధీరజ్ వాళ్లకి కనిపిస్తాడు. ధీరజ్ ఆతన్ని వెంబడిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |